IPL 2026లో ఆరెంజ్ క్యాప్ విజేత ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ ప్రతిష్టాత్మక టోపీని కైవసం చేసుకున్నాడు. ఫైనల్‌కు ముందు రేసులో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ వెనకబడటంతో, ఈ సీజన్లో పరుగుల వరద పారించిన వైభవ్‌కు ఆరెంజ్ క్యాప్ దక్కడం లాంఛనమైంది.