KNR: జమ్మికుంట పట్టణంలో ఆదివారం బీఎస్పీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. పార్టీ సెక్టార్, బూత్ కమిటీల నిర్మాణానికి రాష్ట్ర నాయకుడు మంద సమ్మయ్య పిలుపునిచ్చారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. డాక్టర్ అంబాల ప్రభాకర్ సహా నాయకులు పాల్గొన్నారు.