GNTR: తెనాలిలో సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ 83వ జయంతిని అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం పట్టణంలోని తెనాలి బండ్పై ఉన్న కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 1943 మే 31న బుర్రిపాలెం గ్రామంలో జన్మించిన కృష్ణ తెలుగు సినీ రంగంలో అనేక సంచలనాలను నెలకొల్పి ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారని అభిమానులు పూర్ణచంద్, యశ్వంత్ కొనియాడారు.