KRNL: ఎండోమెంట్ శాఖలో గ్రేడ్-1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సుదీర్ఘకాలం నిజాయితీ, క్రమశిక్షణ, అంకిత భావంతో సేవలందించిన పి.సి. రాంప్రసాద్ పదవీ విరమణ కార్యక్రమం ఆదోనిలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శ్రేయోభిలాషులు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు అన్ని విధాలుగా అండగా నిలిచిన లక్ష్మీదేవికి కూడా అభినందించారు.