NGKL: వెల్దండ మండలం కంటోన్‌పల్లి గ్రామానికి చెందిన గుండ్రాతి వెంకటేష్‌కు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కును కాంగ్రెస్ నాయకులు జక్కుల చిన్న జంగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ రామకృష్ణ ఆదివారం అందజేశారు. అనారోగ్య చికిత్స కోసం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో రూ.17,500 ఆర్థిక సాయం మంజూరైనట్లు తెలిపారు. లబ్ధిదారుడు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.