AKP: పాయకరావుపేట, నక్కపల్లిలో రేపు హోంమంత్రి అనిత పర్యటించనున్నట్లు టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ తెలిపారు. ఉదయం 7 గంటలకు సత్యవరంలో పర్యటించి పింఛన్లను పంపిణీ చేస్తారన్నారు. వర్షాలకు చెట్టు పడి మృతి చెందిన అరట్లకోటకు చెందిన మృతుల కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు. ఉదయం 10 గంటలకు నక్కపల్లిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు.