VSP: ఉత్తరాంధ్ర చిరకాల ఆకాంక్ష అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావడం చారిత్రాత్మక ఘట్టమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ‘డబుల్ ఇంజన్ సర్కార్’ కృషితోనే ఈ మైలురాయి సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఈ జోన్‌తో రైల్వే మౌలిక వసతులు పెరిగి విశాఖ వాణిజ్య కేంద్రంగా నిలుస్తుందన్నారు.