ELR: ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు విరాళాలు అందజేశారు. పోతవరం గ్రామానికి చెందిన కె. భారతి నిత్యాన్నదాన పథకానికి రూ. 1,00,000 విరాళంగా ఇచ్చారు. అలాగే, గోపవరం వాస్తవ్యులు యన్. రామకృష్ణ విమాన గోపుర స్వర్ణమయ పథకానికి రూ. 1,01,116 అందించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలను అభినందించారు.