VZM: రేపటి నుంచి 30 వరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు గంట్యాడ PHC వైద్యాధికారిణి డాక్టర్ హేమలత తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. ‘మనం సాధించగలం… మనం సాధించాలి” అనే థీమ్‌తో మలేరియా నియంత్రణపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పరిసర ప్రాంతాలన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, డ్రైడే-ఫ్రైడే నిర్వహించాలని సూచించారు.