KNR: గంగాధర మండలంలోని మల్లాపూర్, గోపాలరావుపల్లి గ్రామాల్లో బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ కొలేపాక కవిత, ఎంఈవో ఎనుగు ప్రభాకర్‌రావు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల ప్రవేశాలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, డిజిటల్ తరగతులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం సౌకర్యాలకపై అవగాహన కల్పించారు.