JGL: కోరుట్ల నియోజకవర్గంలోని మెట్ల చిట్టాపూర్, పెద్దాపూర్, చిన్నమెట్పల్లి గ్రామాల్లో ఇటీవల అగ్నిప్రమాదాల వల్ల దగ్ధమైన ఈత వనాల పునరుద్ధరణకు చర్యలు వేగం పుంజుకున్నాయి. ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ విజ్ఞప్తిపై స్పందించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఈత వనాల్లో బోరువెల్ పంపుసెట్ల ఏర్పాటుకు రూ. 6 లక్షలు మంజూరు చేశారు.