ATP: రాయదుర్గం మండలం కే టీ ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా డాక్టర్ డి. సహదేవుడు బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లాలోని ఆర్ట్స్ కళాశాలలో హిస్టరీ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆయన ప్రమోషన్‌పై రాయదుర్గం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. కళాశాల అధ్యాపకులు ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.