MDK: రామాయంపేట మండల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును స్థానిక నేతలు కోరారు. సుతారిపల్లి సర్పంచ్ మద్దురి సునీల్, సంజీవరెడ్డి, రవి, ప్రశాంత్, స్రవంతి రాజేంద్రగుప్తా తదితరులు కలిసి గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పనులను వివరించారు. సానుకూలంగా స్పందించిన మైనంపల్లి, నిధుల సాధనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.