AP: రాజధాని లేకుండా ఇన్నాళ్లూ ఏపీ ప్రజలు ఇబ్బందిపడ్డారని ఎంపీ రేణుకాచౌదరి అన్నారు. కొందరు భౌభౌ అని అరిచినా అమరావతి ఆగదని స్పష్టం చేశారు. భద్రాచలంలో 5 గ్రామాల విలీనంపై చంద్రబాబు ఆలోచించాలని కోరారు. భద్రాద్రి రామాలయ భూములు ఏపీలో ఉండటంతో పాలనాపర సమస్యలు వస్తున్నాయని తెలిపారు. విలీన గ్రామాల విద్యార్థులు స్థానికత విషయంలో నష్టపోతున్నారని చెప్పారు.