AP: రాష్ట్రంలో ఎండలు, వడగాల్పులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు 46 మండలాల్లో, బుధవారం 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రపై దీని ప్రభావం అధికంగా ఉండనుంది. ఇవాళ పలుచోట్ల 44°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ద్రోణి ప్రభావంతో అల్లూరి, ఏలూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.