సంగారెడ్డి జిల్లాలో వైద్య సేవలు మరింత మెరుగుపడాలని, ఇందుకోసం వైద్యులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సోమవారం కలెక్టరేట్లో వైద్యశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఆసుపత్రి నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. రోగులకు మెరుగైన చికిత్స అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని, మౌలిక వసతులు కల్పించాలని కోరారు.