JN: పాలకుర్తి మండల కేంద్రంలోని రిజర్వాయర్ పనులను వెంటనే పూర్తి చేయాలని మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పనులు ఆలస్యం కావడంతో ముదిరాజ్ మత్స్యకారులు 8 ఏళ్లుగా నష్టపోతున్నారని తెలిపారు. కుంటల ఆక్రమణపై శాటిలైట్ సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని కోరారు.