HYD: నగరంలో వేసవికాలంలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ట్రాన్స్ ఫార్మర్, ఉప కేంద్రాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పలుచోట్ల షార్ట్ సర్క్యూట్, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మేడ్చల్ ప్రాంతంలో రాత్రి కరెంటు వైర్ల వద్ద మంటలు బగ్గుమనగా, విద్యుత్ టీం వెంటనే స్పందించి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.