NRPT: నర్వ మండలం లంకల గ్రామ కొట్టం రవి రెడ్డి, సుమిత్ర దేవి దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును మండల ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వాకిటి లలితమ్మ దంపతులకు సారె పెట్టి వారిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న గృహ పథకాలు పేదలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.