SRD: వేసవి సెలవుల్లో ఊళ్లకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలన్నారు. ప్రయాణానికి ముందు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని, సీసీ కెమెరాల ఏర్పాటుతో ఎక్కడి నుండైనా పర్యవేక్షించవచ్చని తెలిపారు. తాళం వేసిన ఇళ్లే దొంగల లక్ష్యంగా ఉంటాయని హెచ్చరించారు.