BDK: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ జూలూరుపాడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కేజీబీవీ కళాశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీలో వంటశాల, పరిసరాల పరిశుభ్రతను పర్యవేక్షించి, విద్యార్థినులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని సూచించారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించి, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు.