NRML: జిల్లాలోని భత్తిస్ ఘడ్ కోటలో అరుదైన రహస్య మెట్లబావి ఉన్నట్లు చరిత్ర పరిశోధకుడు డా. తుమ్మల దేవరావ్ వెల్లడించారు. సుమారు 200 మెట్లు దిగే ఈ బావి నీటి కోసం కాకుండా సైనిక అవసరాల కోసం నిర్మించారని తెలిపారు. బావి అడుగుభాగంలో సొరంగ మార్గం ఉండటం ప్రత్యేకతగా నిలిచింది. ఈ చారిత్రక నిర్మాణాన్ని పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని కోరారు.