రేపు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా SRH vs DC పోరు జరగనుంది. ఈ సీజన్లో ఇరు జట్లు కూడా 6 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. హోం గ్రౌండ్ వేదికగా వరుసగా రెండు విజయాలు సాధించిన సన్రైజర్స్, ఇప్పుడు ‘హ్యాట్రిక్’ విజయంపై కన్నేసింది. అయితే, గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్కు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని సమాచారం.