ప్రకాశం: గిద్దలూరు పట్టణ పరిధిలోని కొత్తపల్లి ప్రధాన రహదారి, రాచర్ల రోడ్డు, కొండపేట ప్రాంతాల్లో గల సర్వే నంబర్లలో గుర్తించిన అనధికార లే అవుట్లపై పురపాలక అధికారులు చర్యలు తీసుకున్నారు. కమిషనర్ ఈ.వి. రమణ బాబు ఆదేశాల మేరకు, పట్టణ ప్రణాళిక విభాగం 275 అక్రమ హద్దురాళ్లను, రోడ్లను జేసీబీ సాయంతో తొలగించింది.