VZM: జిల్లాలో మహిళలు, బాలికల సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యతను కల్పిస్తూ, మహిళలపై జరుగుతున్న నేరాల్లో నేరస్థులను అరెస్ట్ చేయాలని ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ సిబ్బందిని ఆదేశించారు. త్వరితగతిన శిక్షింపబడే విధంగాను, నిందితులపై నిఘా పెట్టేందుకు, స్పీడు ట్రయల్ మానిటరింగు చేసేందుకు ఆపరేషన్ దండయాన జిల్లాలో అమలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.