KMR: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ మెప్మా పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు రెండు కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును శుక్రవారం మున్సిపల్ ఛైర్మన్ శ్రీకాంత్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీసుకున్న రుణాలతో వ్యాపారాలు అభివృద్ధి చేసుకొని ప్రతి నెల క్రమం తప్పకుండా రుణాలు చెల్లించాలని సూచించారు. ఈకార్యక్రమంలో మెప్మాపీడీ శ్రీధర్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.