అన్నమయ్య: చిన్నమండెం మండలం మల్లూరు గ్రామంలోని మల్లూరు అమ్మ దేవస్థానంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహాభారతం కార్యక్రమానికి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.1.50 లక్షల విరాళాన్ని అందజేశారు. హరితమ్మ సేవాభావాన్ని నిర్వాహకులు అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.