NTR: ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో భక్తులకు నగదు రహిత సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఈవో వి.కె. శీనా నాయక్ తెలిపారు. వాట్సాప్ ద్వారా దర్శనం, సేవలు, లడ్డూ ప్రసాదం, కేశఖండన టిక్కెట్లు బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. భక్తులకు సహాయం కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.