కోనసీమ: పేరవరం – బొబ్బర్లంక మధ్య శుక్రవారం రోడ్డు పక్కన ఉన్న భారీ చెట్టు కొమ్మ విరిగి రహదారిపై పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో వెంటనే చెట్టు కొమ్మను తొలగించాలని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.