GDWL: అయిజ మండలం కొత్తపల్లిలో భాగ్యమ్మ అనే లబ్ధిదారురాలు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని డీసీసీ జనరల్ సెక్రెటరీ సంకాపూర్ రాముడు, కాంగ్రెస్ నేత ఉత్తనూరు జయన్న ప్రారంభించారు. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు సీఎం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని వారు తెలిపారు. గత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఈ సందర్భంగా వారు విమర్శించారు.