KRNL: కౌతాళం మండలంలోని వల్లూరు గ్రామంలో నిర్వహించిన రీ సర్వే కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి అడివప్ప గౌడ్ శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే వల్ల భూముల హద్దులు స్పష్టమై రైతుల మధ్య వివాదాలు తగ్గుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు.