KDP: టీడీపీ నిర్వహించిన వర్చువల్ మహానాడు ప్రజా వ్యతిరేకతతో అట్టర్ ఫ్లాప్ అయిందని కడప వైసీపీ ఎస్ఈసీ సభ్యుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ విమర్శించారు. క్లస్టర్ల వారీగా మహానాడు నిర్వహించి కార్యకర్తల డబ్బులను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ ప్రచార ఆర్భాటానికే ప్రాధాన్యం ఇచ్చారని ఆయన అన్నారు.