TPT: చెన్నారెడ్డి కాలనీలో రూ.40 లక్షలతో నిర్మించిన మహిళా స్వశక్తి భవనం, రూ.18 లక్షల మస్టర్ రూమ్‌ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. మహిళల నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, డ్వాక్రా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.