PPM: ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని ఎల్విన్‌పేట అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంజాయి, నాటుసారా అక్రమ రవాణా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేసి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.