ATP: గుంతకల్లు మండలం దోనిముక్కల గ్రామంలో ఉపాధి హామీ పనులను సీపీఐ నాయకులు పరిశీలించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దేవేంద్ర, గుంతకల్లు మండల కార్యదర్శి రాము రాయల్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని, కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు.