ASR: హుకుంపేట మండలంలోని గంగరాజుపుట్టు గ్రామంలో శుక్రవారం విద్యుత్ షాక్కు గురై, గ్రామానికి చెందిన జన్ని రమేష్ అనే రైతుకు చెందిన 3 గొర్రెలు మృతి చెందాయని స్థానికులు తెలిపారు. గ్రామంలో విద్యుత్ లైన్స్ సరిగ్గా లేవని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో ఏ సమయంలో ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.