ముంబై స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. GTతో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 31 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో తిలక్‌కు ఇదే మొదటి హాఫ్ సెంచరీ కాగా, ఓవరాల్‌గా ఐపీఎల్ కెరీర్లో ఇది 9వది. అశోక్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో తిలక్ వరుసగా 6, 4, 4, 6, 6 బాది మొత్తం 26 పరుగులు పిండుకున్నాడు.