MHBD: పెద్ద గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ పార్లమెంట్ కన్వీనర్ కోండపల్లి రామచందర్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో TDP నేతలు ఉన్నారు.