కల్తీ ఆహార ముఠాలపై సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తక్కువ సమయంలోనే కల్తీ ఆహార ముఠాల ఆటకట్టిస్తూ ప్రజారోగ్యం కోసం అంకితభావంతో పనిచేస్తున్న అధికారులందరికీ అభినందనలు తెలిపారు. ఆరోగ్య హైదరాబాద్ – సురక్షిత హైదరాబాద్ అన్నదే తన నినాదం అన్నారు. ప్రజలు తాము ఏం తింటున్నారో, అది ఎక్కడి నుంచి వస్తుందో గమనించి అవగాహన పెంచుకోవాలని సూచించారు.