ఆడిన తొలి మ్యాచ్లోనే SRH బౌలర్ ప్రఫుల్ హింగే సంచలనం సృష్టించాడు. తొలి ఓవర్లలోనే మూడు వికెట్లు తీసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇతడిని 2026 వేలంలో SRH రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. 10 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 27 వికెట్లు తీశాడు. విదర్భ జట్టులో ఇతడు కీలక సభ్యుడు. వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడంలో ఈ కుర్రాడు దిట్ట.