TG: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమ తదుపరి ఆదేశాల వరకు హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్ట వద్దని ఆదేశించింది. కూల్చివేతల్లో హైడ్రాకు సరైన ప్రామాణికత లేదని అభిప్రాయపడింది. నోటీస్ ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్నారని మండిపడింది. చెరువులు, పార్కులు, రోడ్లు ఆక్రమిస్తే కూల్చివేయవచ్చని తేల్చి చెప్పింది.