KMM: కూసుమంచి మండలంలోని చిన్నపోచారం గ్రామంలో సోమవారం ఉదయం కొండచిలువ కలకలం సృష్టించింది. తెల్లవారుజామున బయటకు వెళ్లిన యువకులకు సుమారు 10 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని ఆ పామును హతమార్చారు. భారీ కొండచిలువ మృతితో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.