BDK: నేడు భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని శాఖల మండలాధికారులు హాజరయ్యే ఈ వేదికపై ప్రజలు తమ సమస్యలను దరఖాస్తుల రూపంలో అందజేసి పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.