SDPT: హుస్నాబాద్ మండల కేంద్రంలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ‘ఉద్యమ్’ నమోదుపై శిక్షణ నిర్వహించారు. MSMEలకు లభించే ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రుణ సౌకర్యాలు, సబ్సిడీల గురించి అవగాహన కల్పించారు. చిన్న తరహా పరిశ్రమల రిజిస్ట్రేషన్ ద్వారా కలిగే ప్రయోజనాలను గ్రామ సంఘాల అధ్యక్షులు, సీసీలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సహాయకులు పాల్గొన్నారు.