TG: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, సమ్మె అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విలీనం అంశం కమిటీ దగ్గర ఉందని, సమ్మె విషయంలో రెండు సమస్యలపై మినహా మిగతా అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సిబ్బందికి సంబంధించిన అంశాలు పరిస్కరిస్తామని, ప్రేరేపిత సమ్మెలకు వెళ్ళవద్దని కార్మికులను కోరారు. పెండింగ్ డీఏ ఇచ్చామని.. పీఆర్సీపై ఆలోచన చేస్తున్నామన్నారు.