వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ తర్వాత.. ఓ స్పెషల్ సాంగ్‌ను షూట్ చేయనున్నారట. అంతేకాదు ఈ పాటలో మరో హీరోయిన్ కనిపిస్తుందట. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నారా రోహిత్ నెగటివ్ షేడ్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని టాక్.