AP: అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులను రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబును ముర్ము అభినందించినట్లు చెప్పారు. అమరావతిపై వైసీపీ విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. మావిగన్ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు.