SRD: జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని ఇంటర్న్షిప్ పథకం (PMIS) అమల్లో ఉందని డీఐసీ జనరల్ మేనేజర్ తెలిపారు. 18-25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు, 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. డిగ్రీ ఫైనల్ ఇయర్, దూరవిద్య విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ శిక్షణలో 6 నుంచి 9 నెలలపాటు నెలకు రూ.9,000 స్టైఫండ్ లభిస్తుందన్నారు.