RR: పూజల పేరుతో అమాయకులను మోసం చేసి డబ్బులు దోచుకుంటున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. షాద్నగర్ పట్టణంలోని సీఎస్ కే విల్లా ప్రాంతంలో పూజల పేరుతో అమాయకులను మోసం చేసి డబ్బులు దోచుకుంటున్నారన్నా సమాచారంతో విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి నుంచి రూ.6 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.