SRPT: పాలకీడులో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. క్షేమంగా ప్రయాణించి సురక్షితంగా గమ్యం చేరడమే లక్ష్యంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. అతివేగం వల్ల కలిగే ప్రమాదాలను వివరించి, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.